Current Affairs Telugu Daily

1.25 లక్షల ఎకరాలు తగ్గిన యాసంగి సాగు 
యాసంగి సాధారణంకన్నా లక్ష ఎకరాల వరకు తక్కువగా ఉందని వ్యవసాయశాఖ బుధవారం విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. యాసంగి సీజన్‌ మొత్తం సాధారణ విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు. అన్ని పంటలూ కలిపి బుధవారం వరకు సాధారణ విస్తీర్ణం 15.27 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలి. కానీ 14.02 లక్షల ఎకరాల్లోనే విత్తనాలు, నాట్లు వేశారు. గతేడాది ఇదే సమయానికి 14.67 లక్షల ఎకరాల్లో వేయగా ఈసారి అంతకన్నా 65 వేల ఎకరాలు తక్కువగా ఉంది. గత జూన్‌ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో వర్షపాతం సాధారణం కన్నా 17 శాతం తక్కువ నమోదైంది. మొత్తం 18 జిల్లాల్లో వర్షపాతం లోటు 20 నుంచి 49 శాతం వరకు ఉంది. వరి నాట్లు వేయడానికి ఈ నెలాఖరు వరకూ సమయం ఉందని, సాగు విస్తీర్ణం పెరుగుతుందని వ్యవసాయాధికారులు చెప్పారు. నీటి వసతి లేని పొలాల్లో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
views: 760



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams