Current Affairs Telugu Daily

ఏ పీ ఎస్పీ డి సీ ఎల్ బడ్జెట్ రూ. 24,263 కోట్లు 
రానున్న ఆర్థిక సంవత్సరంలో (2019-20)లో రూ.24,463.66 కోట్ల వ్యయ అంచనాలతో ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్‌) బడ్జెట్‌ను రూపొందించింది. ఇందులో పరిశ్రమలు, గృహ, ఇతర వినియోగదారులతోపాటు వివిధ వర్గాలకు విద్యుత్తు సరఫరా ద్వారా రూ.17,141.87 కోట్ల ఆదాయం సమకూర్చుకోనుంది. మిగిలిన సుమారు రూ.7321.79 కోట్ల రెవెన్యూ లోటును క్రాస్‌ సబ్సిడీ, సర్‌ఛార్జి, ప్రభుత్వ రాయితీ, ఇతర మార్గాల ద్వారా భర్తీ చేసుకోనుంది. బుధవారం తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయంలో 2019-20 సంవత్సరానికి ఆదాయ, వ్యయ అంచనాల ప్రతిపాదనలతోపాటు 2019 నుంచి 2024 మధ్య నిర్వహణ వ్యయ భారం, పెట్టుబడులు వంటి అంశాలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. సంస్థ ఆదాయ, వ్యయాల వివరాలను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్‌ భవానీప్రసాద్‌, సభ్యులు రఘు, రామ్మోహన్‌లకు ఎస్పీడీసీఎల్‌ సీఎండీ ఎం.ఎం.నాయక్‌ అందించారు. ప్రతిపాదనల్లో ముఖ్య అంశాలు..
* 2019లో రూ.2741 కోట్లు ఉన్న నిర్వహణ వ్యయం 2024 నాటికి రూ.5078 కోట్లకు పెరుగనుంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2664 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తుండగా 2023-24 నాటికి¨ రూ.3206 కోట్లు వస్తాయని ప్రణాళికలు రూపొందించారు.
* డిస్కమ్‌ పరిధిలోని ప్రభుత్వ శాఖలు, విభాగాల ద్వారా సంస్థకు రూ.3153 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో స్థానిక సంస్థల నుంచి రూ.1889 కోట్లు, వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి రూ.1190 కోట్లు వసూలు కావాల్సి ఉంది.
* 2017-18లో డిజిటల్‌ చెల్లింపుల ద్వారా రూ.9050 కోట్ల ఆదాయం రాగా 2018-19లో డిసెంబరు నాటికి రూ.8429 కోట్లు వచ్చింది. ఈ డిస్కమ్‌ పరిధిలో 74.11 శాతం బిల్లుల వసూలు డిజిటల్‌ చెల్లింపుల ద్వారానే జరుగుతోంది.

views: 737



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams