Current Affairs Telugu Daily

వాహనాల మౌలిక నిర్మాణాన్ని మార్చొద్దు : సుప్రీం
మోటారు వాహనాల మౌలిక నిర్మాణంలో మార్పులపై సుప్రీంకోర్టు 2019 జనవరి 9న కీలక తీర్పు వెలువరించింది.
  • రిజిస్ట్రేషన్‌ సమయంలో వాహనాలకు సంబంధించి తయారీదారులు పేర్కొన్న వాస్తవ ప్రత్యేకతను ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదని స్పష్టం చేసింది. కేరళ మోటారు వాహనాల నిబంధను-1989 ప్రకారం వాహనాల్లో నిర్మాణపరమైన మార్పు ఆమోదనీయమేనంటూ కేరళ హైకోర్టు డివిజన్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
  • రోడ్డు భద్రత, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని వాహనాల మౌలిక నిర్మాణంలో మార్పును నిషేధిస్తూ మోటారు వాహనాల చట్టంలో సవరణ తీసుకొచ్చిన సంగతిని సుప్రీంకోర్టు గుర్తుచేసింది.
  • వాహన మౌలిక నిర్మాణాలన్ని ఎంతమేరకు మార్చకూడదో సవరించిన నిబంధనల్లో స్పష్టంగా సూచించారని పేర్కొంది.

views: 678

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams