Current Affairs Telugu Daily

తెలంగాణలో 2 రహదారులకు గుర్తింపు
తెలంగాణలో 2 రహదారులకు గుర్తింపుః సూత్రప్రాయంగా అంగీకరించిన కేంద్రం
తెలంగాణలో 334 కిలోమీటర్ల మేర రెండు జాతీయ రహదారుల గుర్తింపునకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందని రహదారి రవాణా శాఖ సహాయమంత్రి మాండవియా తెలిపారు. ఈ మేరకు ఆయన సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ మహ్మద్‌ అలీఖాన్‌ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. సంగారెడ్డి- నర్సాపూర్‌- తూప్రాన్‌- గజ్వేల్‌- జగ్‌దేవ్‌పూర్‌- భువనగిరి-చౌటుప్పల్‌ (సుమారు 154 కి.మీ.) చౌటుప్పల్‌-షాద్‌నగర్‌-కంది (180కి.మీ.) జాతీయ రహదారులు కానున్నాయి. హైదరాబాద్‌ చుట్టూ ఇవి విస్తరించి ఉన్నాయి.అవసరమైన భూసేకరణలో 50శాతం భరించడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.

views: 898

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams