Current Affairs Telugu Daily

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మ
సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌ వర్మ నియామకాన్ని సుప్రీం కోర్టు పునరుద్ధరించింది.
అలోక్‌వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పించి, ఆయన్ను సెలవులో పంపిస్తూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ), కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
సీబీఐ డైరెక్టర్‌గా పునః నియామకం అయినప్పటికీ అలోక్ వర్మ ప్రధాన విధానపరమైన నిర్ణయాలేమీ తీసుకోరాదని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈ కేసుపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపి, డిసెంబర్ 6వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది.
నిర్ణయాన్ని సమర్థించుకున్న సీవీసీ కేంద్ర విజిలెన్స్ కమిషన్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.
సీవీసీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. సీబీఐలో ఒక అసాధారణ పరిస్థితి తలెత్తిందని, అలోక్ వర్మను డైరెక్టర్‌గా కొనసాగించలేని పరిస్థితి అదని వివరించారు.
అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు కొన్నిసార్లు అసాధారణ నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అందుకే అలోక్ వర్మను సెలవులో పంపించాల్సి వచ్చిందని చెప్పారు
Headquarters: New Delhi
Founded: 1963

views: 1049

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams