Current Affairs Telugu Daily

తెలంగాణ తొలి మంత్రవర్గ సమావేశం
శాసనసభ ఎన్నికలు జరిగి టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 2019జనవరి 7న తొలి మంత్రవర్గ సమావేశం ప్రగతిభవన్‌లో జరిగింది. హోం మంత్రి మహమూద్‌ అలీతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, ఇతర ముఖ్యమైన అధికారులు హాజరయ్యారు.
  • రాష్ట్ర మంత్రిమండలి తొలి సమావేశం ఆంగ్లో ఇండియన్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా ఎల్విస్‌ స్టీఫెన్‌సన్‌ను మంత్రిమండలి ఎంపిక చేసింది. గత శాసనసభలోనూ ఆయన నియమిత సభ్యునిగా ఉన్నారు. 
  • పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి ఆమోదం తెలిపింది. పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శులుగా పేరు మార్పు చేసింది. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న నియామకాల ప్రాతిపదికన ఉత్తర్వు జారీకి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శి వ్యవస్థ తీరుతెన్నుల
  • పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శుకులు ఎలాంటి హోదా ఇవ్వరు. మంత్రిమండలి సమావేశాల్లో వీరు పాల్గొనే వీలుండదు. ప్రమాణ స్వీకారం లేకుండానే పదవులు చేపడతారు.
  • మంత్రులకు సహాయకారులుగా ఉంటారు. శాసనసభలో మంత్రులు లేని సమయంలో వారి తరఫున సమాధానం చెప్పేలా చట్టంలో మార్పు తెస్తారు.
లాభదాయకమైన పదవుల జాబితా కింద రాకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు.

views: 830

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams