Current Affairs Telugu Daily

‘పర్సనల్‌ చట్టాల సవరణ బిల్లు-2018’కు లోక్‌సభ ఆమోదం
జీవిత భాగస్వామికి కుష్ఠు ఉందన్న కారణంతో విడాకుల నిరోధానికి సంబంధించిన ‘పర్సనల్‌ చట్టాల సవరణ బిల్లు-2018’ను లోక్‌సభ 2019 జనవరి 7న మూజువాణి ఓటుతో ఆమోదించింది.
  • హిందూ వివాహచట్టంతో పాటు ముస్లిం, క్రైస్తవ, ప్రత్యేక వివాహల రద్దు చట్టాలూ, హిందూ దత్తత-మనోవర్తి చట్టానికి ఈ సవరణ వర్తించనుంది.
  • బిల్లును ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ వ్యతిరేకించారు. మన దేశంలో కుష్ఠు ఇంకా పూర్తిగా నిర్మూలం కాలేదని, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి ముస్లిం దేశాల్లోని కోర్టు ఈ రుగ్మతను పరిగణనలోకి తీసుకుని విడాకుల మంజూరు చేస్తున్నాయని చెప్పారు. ముస్లిం పర్సనల్‌ లా విషయంలో ప్రభుత్వ జోక్యం తగదన్నారు.

views: 759

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams