Current Affairs Telugu Daily

16 విమానాశ్రయాల్లో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై నిషేధం
దేశంలోని 16 విమానాశ్రయాల్లో ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ వస్తువులను భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ(AAI) నిషేధించింది.
  • దీంతో ఈ విమానాశ్రయాల్లో ప్లాస్టిక్‌ ప్లేటు, స్ట్రా వంటివి లభ్యం కావు. త్వరలో మరికొన్ని విమానాశ్రయాలకు ఈ నిబంధన విస్తరించనుంది. ఏటా 10 లక్షల మంది కన్నా ఎక్కువ మంది ప్రయాణికులు వచ్చే 34 విమానాశ్రయాల్లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధించాలని ఏఏఐ నిర్ణయించింది.
  • ఈ నిర్ణయం అమలును పర్యవేక్షించడానికి భారత నాణ్యతా మండలి సేవలను ఉపయోగించుకోనుంది.
  • ఇందులో భాగంగా మొదటి విడతగా 16 విమానాశ్రయాలను ఎంపిక చేసింది. ఇందుల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాలు ఉన్నాయి.
  • విమానాశ్రయాల్లో వ్యర్థాల  నిర్వహణ వ్యవస్థను పెంచడం, నేలలో కలసిపోయే సామర్థ్యమున్న చెత్త కవర్లను చెత్త కుండీల్లో ఏర్పాటు చేయడం, ప్లాస్టిక్‌ సీసాను ధ్వంసం చేసే యంత్రాలను పెట్టడం వంటి చర్యలను చేపట్టినట్లు ఏఏఐ పేర్కొంది. 
AAI-Airports Authority of India

views: 771

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams