Current Affairs Telugu Daily

పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులను ప్రాణ జీవులుగా గుర్తించాని హైకోర్టులో పిల్‌
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తున్న పెన్నా, కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదులను, వాటి ఉప నదులను ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించాలంటూ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. మనిషికి ఉండే అన్ని చట్టబద్ధమైన హక్కులను వాటికి కూడా కల్పించాలని కోరుతూ లా స్టూడెంట్‌ దీప్యా చౌదరి పిల్‌ దాఖలు చేశారు. ఈ నదులు తమను తాము రక్షించుకోలేవు కాబట్టి వాటిని ప్రాణమున్న, చట్టబద్ధ జీవులుగా గుర్తించాని కోరుతున్నానని పిటిషన్‌లో పేర్కొంది.
` ఇటీవల ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఇటీవల గంగ, యమున నదులను ప్రాణ జీవులుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది
` ప్రపంచంలో ప్రాణజీవిగా గుర్తింపు పొందిన మొట్టమొదటి నది ` వాంగనూయ్‌ (న్యూజిలాండ్‌)

views: 1267

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams