Current Affairs Telugu Daily

నర్మదానదిలో ఆక్టోపస్‌లు 
నర్మదానది ఉప్పునీటి జలాల్లో భారతీయ శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా ఆక్టోపస్‌ను కనుగొన్నారు.
  • 190 నుంచి 320 మిల్లీమీటర్ల పొడవు ఉన్న 17 ఆక్టోపస్‌లను గుర్తించారు. వీటిని ‘‘సిస్టోపస్‌ ఇండికస్‌’’ అనే శాస్త్రీయనామంతో పిలుస్తారు. సముద్రజలాల్లో 50 మీటర్ల లోతున కనిపించే ఈ జీవులు.. భారతీయ సముద్రతీర ప్రాంతంలోని ఉప్పునీటి జలాల్లో కూడా జీవిస్తాయని మొదటిసారి తెలిసిందని సముద్రజీవశాస్త్రవేత్తలు చెబుతున్నారు.
  • గుజరాత్‌లోని వడోదరలో గల కేంద్రీయ ఉప్పునీటిజలాల చేపల పరిశోధన కేంద్రాని(సీఐఎఫ్‌ఆర్‌ఐ)కి చెందిన శాస్త్రవేత్తలు వీటిని కనుగొన్నారు. గుజరాత్‌లోని ఖంభాత్‌ సముద్రతీరానికి దగ్గరగా గల భాద్‌భుట్‌ గ్రామం వద్ద నర్మదానది, సముద్రం కలుస్తాయి. ఇక్కడ నీటిలో ఉప్పుశాతం ఎక్కువ.
  • అధిక అలల తాకిడికి ఈ నీటిలోకి ఆక్టోపస్‌లు వచ్చి ఉంటాయని ‘సీఐఎఫ్‌ఆర్‌ఐ’ శాస్త్రవేత్త డాక్టర్‌ దిబాకర్‌ భట్కా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 200రకాల ఆక్టోపస్‌లు ఉండగా, మన భారతీయ సముద్రజలాల్లో 38రకాలు ఉన్నాయన్నారు.

views: 955

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams