Current Affairs Telugu Daily

దేశంలోనే తొలిసారిగా 106 అడుగుల వెడల్పు తెరతొ సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్‌ 
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో భారీ మల్టీప్లెక్స్‌ థియేటర్‌ రూపొందుతోంది. పట్టణానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారి పక్కన పిండిపాళెం వద్ద దీన్ని తీర్చిదిద్దుతున్నారు. 670 సీట్ల సామర్థ్యం, 3డీ ‘సౌండ్‌ సిస్టమ్‌’తోపాటు.
దేశంలోనే తొలిసారిగా 106 అడుగుల వెడల్పుతో తెర ఏర్పాటుచేస్తుండడం విశేషం. రూ.40 కోట్ల వ్యయంతో ‘యూవీ క్రియేషన్స్‌’ సంస్థ ఏడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఈ మల్టీఫ్లెక్స్‌ను నిర్మిస్తోంది.
106 అడుగుల వెడల్పు గల భారీ తెరలు ప్రపంచంలో మరో రెండు మాత్రమే ఉన్నాయి. ఆ కోవలో ఇది మూడోదని, ఆసియాలో రెండోదని థియేటర్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఈ మల్టీప్లెక్స్‌లో ఒక్కోటి 170 సీట్ల సామర్థ్యంతో మరో రెండు తెరలు ఉంటాయి.

views: 1093



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams