Current Affairs Telugu Daily

వ్యర్థాల నుంచి శుద్ధ నీరు
మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్లను దేశంలోనే మొదటిసారిగా భారీ స్థాయిలో రాష్ట్రంలోని 76 పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఏడు ప్యాకేజీల్లో చేపట్టే ఈ పనుల్లో నాలుగు ఇప్పటికే ఖరారై ఏజెన్సీలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. మరో మూడు ప్యాకేజీల్లోని పనులు టెండర్ల పరిశీలన దశలో ఉన్నాయి.
ఇందుకోసం స్వచ్ఛాంధ్ర సంస్థ రూ.80 కోట్లకుపైగా ఖర్చు చేయనుంది. పట్టణాల్లో మరుగుదొడ్ల వినియోగం ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ సాయంతో గత నాలుగేళ్లలో 2.50 లక్షల కుటుంబాలు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకున్నాయి.
మానవ వ్యర్థాలను ప్రత్యేక వాహనాల్లో పట్టణ శివార్లలోని ఖాళీ స్థలాల్లో, చెరువులు, కాలువలు, నదులు, సముద్రంలో విడిచి పెడుతున్నారు. దీంతో పర్యావరణ సమస్యలతో పాటు నీరు కలుషితమవుతోంది. ఈ సమస్య పరిష్కారానికి పలు దేశాల్లో వినియోగిస్తున్న మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్లను నిర్మించు-నిర్వహించు-బదిలీ చేయు(బీవోటీ) విధానంలో నెలకొల్పనున్నారు
  • 76 పట్టణాల్లో మానవ వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్లు
  • దేశంలో మొదటి భారీ ప్రాజెక్టు
  • రూ.80 కోట్లతో స్వచ్ఛాంధ్ర సంస్థ కార్యాచరణ

views: 1007

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams