Current Affairs Telugu Daily

GSTపై 100 గంటల కోర్సు 
GST పన్నుల విధానంపై పూర్తి అవగాహన పొందేందుకు, కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (MSDE) మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా 100 గంటల సర్టిఫికేట్‌ కోర్సును ప్రవేశపెట్టనుంది. 2017 జులై 15 నుంచి 3 నగరాల్లో 100 కేంద్రాల్లో కోర్సు ప్రారంభం కానుంది. ప్రధాన్‌మంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన(PMKVY) పథకం కింద డిల్లీ, బెంగళూరు, భోపాల్‌ నగరాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఛార్టెడ్‌ అకౌంటెంట్స్‌, కంపెనీ సెక్రటరీలు, కామర్స్‌ పాఠ్యాంశం కలిగిన గ్రాడ్యుయేట్స్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్స్‌, బ్యాంకింగ్‌, స్టాటిస్టిక్స్‌, ఫినాన్స్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ రంగాలకు సంబంధించిన వారికి శిక్షణ ఇస్తారు. 
MSDE-Ministry of Skill Development and Entrepreneurship
PMKVY-Pradhan Mantri Kaushal Vikas Yojana

views: 1070

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams