Current Affairs Telugu Daily

సీఏలో కొత్త సబ్జెక్టుగా  GST
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(GST)పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఛార్టెడ్‌ అకౌంట్స్‌(సీఏ)కోర్సులో GSTని ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టనున్నారు. దీంతో ఇక నుంచి సీఏ విద్యార్థులు GSTపై పరీక్షలు రాయనున్నారు. సిలబస్‌ను త్వరలో వెల్లడించనున్నారు. సీఏ విద్యార్థులు నవంబరులో జరిగే పరీక్షలో 10 మార్కులకు సంబంధించిన GST అనుబంధ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. 2018 మార్చి నుంచి GST సబ్జెక్టుపై 100 మార్కుకుల పరీక్షను నిర్వహించనున్నట్లు ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ ఛైర్మన్‌ వివేక్‌ ఖురానా వెల్లడించారు. CA CPT, IPCC ఫైనల్‌ ఎగ్జామ్‌ సిలబస్‌లోను మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 
` కర్ణాటకలోని బెళగవి రాణి చిన్నమ్మ విశ్వవిద్యాలయం ఇప్పటికే తమ పరిధిలోని బీకాం 3వ సంవత్సరం విద్యార్థులకు GSTను పాఠ్యాంశంగా తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
CA-Chartered Accountant
CPT-Common Proficiency Test
IPCC- Integrated Professional Competence Course

views: 1116

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams