Current Affairs Telugu Daily

మిషన్‌ కాకతీయకు జాతీయ పురస్కారం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయకు జాతీయ స్థాయిలో పురస్కారం దక్కింది. జలవనరులు, విద్యుత్తు, పునరుత్పాదక ఇంధన వనరుల నిర్వహణలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇరిగేషన్‌ పవర్‌ (సీబీఐపీ) ఏటా అందించే ఎక్స్‌లెన్స్‌ అవార్డు మిషన్‌ కాకతీయకు దక్కింది. సీబీఐపీ దినోత్సవాల్లో భాగంగా కేంద్ర విద్యుత్తు మంత్రి రాజ్‌కుమార్‌ సింగ్‌ చేతుల మీదుగా తెలంగాణ చిన్న నీటిపారుదలశాఖ చీఫ్‌ ఇంజినీరు శ్యాంసుందర్‌ అందుకున్నారు.
అనంతరం సీఈ మాట్లాడుతూ జలవనరుల నిర్వహణలో మెరుగైన పనితీరు ప్రదర్శిస్తూ మిషన్‌ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణకు చేస్తున్న కృషికి గానూ సీబీఐపీ అవార్డు దక్కిందన్నారు.
ఇప్పటి వరకు 20 వేలకు పైగా చెరువులను పునరుద్ధరించామన్నారు. పలు విశ్వవిద్యాలయాల నుంచి వచ్చి మిషన్‌ కాకతీయను అధ్యయనం చేస్తున్నారని శ్యాంసుందర్‌ వివరించారు. కొత్త చెరువుల తవ్వకాలు, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి త్వరలోనే చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీబీఐపీ అధ్యక్షుడు మసూద్‌ హుస్సేన్‌, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి యూపీసింగ్‌, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి ఆనందకుమార్‌, విద్యుత్తుశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా, సీబీఐపీ ఉపాధ్యక్షుడు మహస్కి తదితరులు పాల్గొన్నారు.

views: 838

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams