Current Affairs Telugu Daily

‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ను రూపొందించిన చైనా

‘మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌’ (ఎంవోఏబీ) పేరుతో అమెరికా రూపొందించిన శక్తిమంతమైన అణ్వస్త్రేతర ఆయుధానికి పోటీగా చైనా కూడా ఒక భారీ బాంబును రూపొందించింది. విమానం నుంచి ప్రయోగించే ఈ ఆయుధాన్ని ఆ దేశ రక్షణ సంస్థ ‘నారిన్‌కో’ తాజాగా ప్రదర్శించింది. విధ్వంసక శక్తి విషయంలో అణ్వస్త్రాల తర్వాతి స్థానం ఈ ఎంవోఏబీలదే. దీని అసలు పేరు ‘మ్యాసివ్‌ ఆర్డ్‌నెన్స్‌ ఎయిర్‌ బ్లాస్ట్‌’ (ఎంవోఏబీ). మదర్‌ ఆఫ్‌ ఆల్‌ బాంబ్స్‌గా ఇది ప్రాచుర్యం పొందింది.
2017లో అమెరికా సైన్యం అఫ్గానిస్థాన్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదుల స్థావరాలపై ఈ బాంబును ప్రయోగించింది. పటిష్ఠ భవనాలు, రక్షణ శిబిరాలను కూడా ఇది సమూలంగా నాశనం చేయగలదు. గగనతలంలో హెలికాప్టర్‌ నుంచి సైనికులు తాళ్ల ద్వారా కిందకి దిగాలనుకున్న చోట అడవులు వంటి అవరోధాలు ఉంటే వాటిని నిర్మూలించడానికి కూడా ఈ బాంబును ఉపయోగించొచ్చు.
చైనా రూపొందించిన ఈ తరహా ఆయుధాన్ని హెచ్‌-6కె శ్రేణి బాంబర్‌ విమానం ద్వారా జారవిడిస్తున్న వీడియోను నారిన్‌కో విడుదల చేసింది. దీనివల్ల భారీ విస్ఫోటం చోటుచేసుకుంది. చైనా బాంబు బరువు కొన్ని టన్నుల మేర ఉంటుందని చెబుతున్నారు. పొడవు 5-6 మీటర్ల మేర ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. అమెరికా ఎంవోఏబీ కన్నా కొంచెం చిన్నగా, తక్కువ బరువును కలిగి ఉంటుందంటున్నారు. అమెరికా బాంబు పెద్దగా ఉండటం వల్ల భారీ రవాణా విమానాల్లోనే తరలించడం సాధ్యమవుతుంది.
China Currency: Renminbi Trending
Capital: Beijing
President: Xi Jinping


views: 744

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams