Current Affairs Telugu Daily

కాస్మిక్‌ కిరణాలను పసిగట్టేందుకు టెలిస్కోపు
విశ్వంలోని సుదూర న్యూట్రాన్‌ నక్షత్రాలు, కృష్ణ బిలాలు, ఇతర ఖగోళ వస్తువుల నుంచి వచ్చే కాస్మిక్‌ కిరణాలను అధ్యయనం చేయడానికి అమెరికా శాస్త్రవేత్తలు అంటార్కిటికా నుంచి ఒక టెలిస్కోపును ప్రయోగించారు. ‘ఎక్స్‌ క్యాలిబర్‌’ అనే ఈ సాధనాన్ని హీలియం బెలూన్‌ ద్వారా ఆకాశంలోకి పంపారు.
  • ఇది నేల మీద నుంచి 1.3 లక్షల అడుగుల ఎత్తుకు చేరుకోనుంది. ఇది వాణిజ్య విమానాలు ప్రయాణించే ఎత్తు కన్నా నాలుగు రెట్లు అధికం. భూవాతావరణంలో 99 శాతం మేర దీనికి దిగువనే ఉంటుంది. వెలా ఎక్స్‌-1 అనే న్యూట్రాన్‌ నక్షత్రంపై తమ ప్రధాన దృష్టి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
  • భారీ నక్షత్రాల ఆయుర్దాయం తీరిపోయాక పెద్ద విస్ఫోటంతో పేలిపోతాయి. మిగిలిపోయిన శకలాలు స్వీయ గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఒక్కచోట పోగుపడతాయి.
  • వీటిని  న్యూట్రాన్‌ నక్షత్రాలుగా పేర్కొంటారు. వీటి వ్యాసార్ధం చాలా తక్కువగా దాదాపు 30 కిలోమీటర్ల మేర ఉంటుంది. వాటిలో సాంద్రత చాలా అధికం. వీటిలో న్యూట్రాన్లు ఉంటాయి.

views: 780

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams