Current Affairs Telugu Daily

చంద్రుడికి రెండోవైపు దిగిన చైనా వ్యోమనౌక ‘చాంగే-4’
అంతరిక్ష పరిశోధనల్లో చైనా అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా చంద్రుడి అవతలి భాగంలో వ్యోమనౌకను దించింది.
  • చాంగే-4 అనే ఈ రోబోటిక్‌ యంత్రం ఇప్పటివరకూ పెద్దగా శోధించని ఆ ప్రదేశానికి సంబంధించిన ఫొటోను చాలా దగ్గరి నుంచి అందించింది. 
  • అవతలి భాగంలోని వ్యోమనౌకతో కమ్యూనికేషన్‌ సాగించడం చాలా కష్టం. రేడియో తరంగాలకు చందమామే అడ్డంకి అవుతుంది. 1960, 70లో అమెరికా వ్యోమగాములు చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ, ఆవలి భాగం వైపునకు వెళ్లినప్పుడు వారితో పూర్తిగా రేడియో సంబంధాలు తెగిపోయాయి.
  • ప్రత్యేక ఉపగ్రహాన్ని ప్రయోగించడం ద్వారా చైనా ఈ ఇబ్బందిని అధిగమించింది. భూమికి, చంద్రుడికి మధ్యలో ఉండే సమతుల్య కక్ష్యలో ఉంచడం వల్ల చాంగే-4కు భూమికి మధ్య నిరంతర కమ్యూనికేషన్‌ సాధ్యమైంది. 
  • భూమికి చంద్రుడికి మధ్య గురుత్వాకర్షణ బంధనం ఉంది. దీనివల్ల చంద్రుడి పరిభ్రమణ కాలం, భ్రమణకాలం ఒకేలా ఉంటుంది. అందువల్ల భూమికి అభిముఖంగా ఎప్పుడూ చంద్రుడికి సంబంధించిన ఒకే భాగం ఉంటుంది. రెండో భాగం ఎప్పటికీ భూమి నుంచి కనిపించదు.
  • దాన్ని అవతలి భాగం (ఫార్‌ సైడ్‌)గా పేర్కొంటారు. దీన్ని చంద్రుడి ‘చీకటి భాగం’గా కూడా అభివర్ణిస్తారు. 
  • ఆ భాగాన్ని సోవియట్‌ యూనియన్‌కు చెందిన ‘లూనా-3’ వ్యోమనౌక తొలిసారిగా 1959లో ఫొటో తీసింది. ఆ తర్వాత పలు వ్యోమనౌకలు ఫొటోలు తీశాయి. ఇప్పటివరకూ అక్కడ వ్యోమనౌకలేవీ దిగలేదు. చైనా ఆ పని చేసి చరిత్ర సృష్టించింది.
  • మినీ జీవావరణ ప్రయోగం కోసం బంగాళా దుంపు, కొన్ని మొక్కల విత్తనాలు, పట్టుపురుగు గుడ్లలను పంపారు. తక్కువ గురుత్వాకర్షణ, అధిక రేడియోధార్మికత కలిగిన చంద్రుడి ఉపరితలంపై శ్వాసక్రియ, కిరణజ్యసంయోగ క్రియను పరీక్షించడం దీని ఉద్దేశం. పట్టుపురుగు నుంచి వచ్చే కార్బన్‌ డైఆక్సైడ్‌ను మొక్కలు ఉపయోగించుకుంటాయి. మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్‌ను పట్టుపురుగులు వాడుకుంటాయి. 
లక్ష్యాలు
  • తక్కువ పౌనఃపున్యమున్న రేడియో తరంగాలను పరిశీలించి, విశ్వానికి సంబంధించిన అనేక నిగూఢ అంశాలను తెలుసుకోవడం. కృత్రిమంగా వెలువడే రేడియో తరంగాల వల్ల భూమి మీద వీటిని అధ్యయనం చేయడం కష్టమవుతోంది. 
  • చంద్రుడి ఉపరితలాన్ని శోధించడం. అక్కడి ఖనిజాల తీరుతెన్నులను తెలుసుకోవడం. 
  • జాబిల్లి ఆవలి భాగం వాతావరణ అధ్యయనం కోసం న్యూట్రాన్‌ రేడియోధార్మికత, న్యూట్రల్‌ పరమాణువును శోధించడం. 

views: 735

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams