Current Affairs Telugu Daily

సచిన్‌ టెండుల్కర్‌ గురువు రమాకాంత్‌ ఆచ్రేకర్‌ మృతి
సచిన్‌ టెండుల్కర్‌ కోచ్‌, గురువు రమాకాంత్‌ ఆచ్రేకర్‌ (87) 2019 జనవరి 2న ముంబయిలో మృతి చెందాడు.
  • 1932 జనవరి 2న మహారాష్ట్రలో జన్మించిన ఆచ్రేకర్‌.. క్రికెట్‌ గురువుగా పేరు తెచ్చుకున్నాడు. సచిన్‌, వినోద్‌ కాంబ్లి, చంద్రకాంత్‌ పండిట్‌, ప్రవీణ్‌ ఆమ్రే, అజిత్‌ అగార్కర్‌, రమేశ్‌ పొవార్‌, సమీర్‌ దిఘే, బల్విందర్‌సింగ్‌ సంధు వంటి క్రికెటర్లను తీర్చిదిద్దాడు.
  • 1943లో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టిన ఆచ్రేకర్‌ 1945లో న్యూ హింద్‌ స్పోర్ట్‌ క్లబ్‌కు ఆడాడు. యంగ్‌ మహారాష్ట్ర ఎలెవన్‌, ముంబయి పోర్ట్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
  • 1963లో హైదరాబాద్‌తో జరిగిన మొయినుద్దౌలా గోల్డ్‌కప్‌ క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌లో ఎస్‌బీఐ తరఫున బరిలో దిగాడు. ఆచ్రేకర్‌ ఆడిన ఏకైక ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ అదే. కొద్దికాలం ముంబయి సెలెక్టర్‌గా కూడా పనిచేశాడు.
  • అనంతరం శిక్షకుడిగా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. శివాజీ పార్క్‌లో కామత్‌ మెమోరియల్‌ క్రికెట్‌ క్లబ్‌ను స్థాపించి వర్ధమాన ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు. 11 ఏళ్ల వయసులో సచిన్‌.. ఆచ్రేకర్‌ అకాడమీలో చేరడం అతడి కెరీర్‌తో పాటు భారత క్రికెట్‌ ముఖచిత్రాన్నే మార్చేసింది.
  • పాఠశాల స్థాయిలో ఫాస్ట్‌ బౌలర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సచిన్‌ను బ్యాట్స్‌మన్‌గా మార్చింది ఆచ్రేకరే. ప్రపంచంలోనే సచిన్‌ను మేటి క్రికెటర్‌గా తయారు చేసిన ఆచ్రేకర్‌ను 1990లో ద్రోణాచార్య పురస్కారం వరించింది. 2010లో పద్మశ్రీ పురస్కారం లభించింది.

views: 823

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams