Current Affairs Telugu Daily

కేంద్ర కేబినెట్‌ నిర్ణయాలు
ప్రధాని నరేంద్రమోడి అధ్యక్షతన 2019 జనవరి 2న కేంద్ర కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు
  • కార్మిక సంఘాల చట్టం-1926లో సవరణలకు ఆమోదం. ఇప్పటివరకూ ఉన్న ‘నమోదైన కార్మిక సంఘాలు’ (రిజిస్టర్డ్‌ ట్రేడ్‌ యూనియన్స్‌) స్థానంలో ‘గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు’ అని చేర్చడానికి వీలుగా నిబంధనను సవరించారు.
  • ఇకపై కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో కార్మిక సంఘాలను గుర్తిస్తారు. త్రైపాక్షిక చర్చ వ్యవస్థల్లో ‘గుర్తింపు పొందిన సంఘాల’ ప్రతినిధులకు ప్రాతినిధ్యం లభిస్తుంది. గుర్తింపు పొందిన సంఘాలకు కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక బాధ్యతలు అప్పగిస్తారు. 
  • బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌ విలీనానికి ఆమోదం 
  • ‘ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన’ను మరింత సమర్థంగా నిర్వహించడానికి ‘జాతీయ ఆరోగ్య సంస్థ’ (నేషనల్‌ హెల్త్‌ ఏజెన్సీ)ని ‘జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ’ (‘నేషనల్‌ హెల్త్‌ అథారిటీ)గా మారుస్తూ నిర్ణయం.
  • నేషనల్‌ హెల్త్‌ ఏజెన్సీ రద్దయిపోతుంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నేతృత్వంలోని పాలకమండలి నిర్ణయాలు తీసుకుంటుంది.
  • ఈ పాలకమండలిలో ప్రభుత్వ ప్రతినిధులి, వైద్య రంగ నిపుణులు సభ్యులుగా ఉంటారు.
  • రాష్ట్రీయ యువ సశక్తీకరణ్‌ కార్యక్రమాన్ని 2019-20 వరకు కొనసాగించాలని నిర్ణయించి, రూ.1,160 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం వల్ల 15-29 ఏళ్ల యువతకు ప్రయోజనం కలుగుతుంది.
  • వైద్య ఆరోగ్య పథకాన్నీ 2019-20 వరకు కొనసాగించాలని నిర్ణయించింది. దీని కోసం రూ.2,381.84 కోట్లు ఖర్చుచేస్తారు.
  • వాణిజ్య ఎగుమతిదారులకు రూ.600 కోట్ల మేర ప్రయోజనం కల్పించే పథకానికీ ఆమోదం లభించింది.
  • అసోంలో స్థానిక ప్రజలకు రాజ్యాంగపరమైన, చట్టపరమైన రక్షణలు కల్పించేందుకు అవసరమైన చర్యల్ని సిఫార్సు చేయడానికి ఉన్నతస్థాయి కమిటీని నియమించాలని నిర్ణయించింది.

views: 737

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams