Current Affairs Telugu Daily

తెలంగాణ హైకోర్టు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు 2019 జనవరి 1న ఏర్పాటైంది. తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ చేత గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.
  • ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ మిగిలిన 12 మంది న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ ఆర్‌.ఎస్‌.చౌహాన్‌, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ పి.వి.సంజయ్‌కుమార్‌, జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ పి.నవీన్‌రావు, జస్టిస్‌ చల్లా కోదండరాం చౌదరి, జస్టిస్‌ బి.శివశంకరరావు, జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌, జస్టిస్‌ పి.కేశవరావు, జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ ప్రమాణం చేశారు. 
  • తెలంగాణ హైకోర్టు ఏర్పాటుతో పని విభజనలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌ కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేశారు.
  • ప్రధాన న్యాయమూర్తి సహా మొదటి ముగ్గురు సీనియర్‌ న్యాయమూర్తుల నేతృత్వంలో ధర్మాసనాలు ఏర్పాటయ్యాయి. మిగిలిన న్యాయమూర్తులు ఏకసభ్య ధర్మాసనాలుగా కేసు విచారణ చేపడతారు. 
  • జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు వేర్వేరుగా హైకోర్టు ఏర్పాటుకావడంతో గతంలో ఉమ్మడి హైకోర్టు వెబ్‌సైట్‌ స్థానంలో రెండు హైకోర్టుకు వేర్వేరుగా కొత్త వెబ్‌సైట్లను రూపొందించారు.

views: 929



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams