Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ నూతన హైకోర్టు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌ నూతన హైకోర్టు 2018 జనవరి 1న ప్రారంభమైంది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ సహా 14 మంది న్యాయమూర్తులతో విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేశారు.
  • తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌, జస్టిస్‌ సరస వెంకట నారాయణ భట్టి, జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్‌ మంధాత సీతారామమూర్తి, జస్టిస్‌ ఉప్మాక దుర్గా ప్రసాదరావు, జస్టిస్‌ తాళ్లూరి సునీల్‌ చౌదరి, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణ మూర్తి, జస్టిస్‌ గుడిసేవ శ్యాంప్రసాద్‌, జస్టిస్‌ జవలాకర్‌ ఉమాదేవి, జస్టిస్‌ నక్కా బాలయోగి, జస్టిస్‌ తేప్రోలు రజని, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు, జస్టిస్‌ కొంగర విజయలక్ష్మి, జస్టిస్‌ మంతోజ్‌ గంగారావు ప్రమాణం చేశారు. 

views: 1093



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams