Current Affairs Telugu Daily

ఒంగోలు, ఏలూరు, కడప నగరాభివృద్ధి సంస్థలు ఏర్పాటు 
ఒంగోలు, ఏలూరు, అన్నమయ్య(కడప) పేరుతో కొత్తగా 3 నగరాభివృద్ధి సంస్థ(యూడీఏ)ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 2019 .
  • జనవరి 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న 10 నగరాభివృద్ధి సంస్థతో కలిపి రాష్ట్రంలో వీటి సంఖ్య 13కి చేరింది.
  • రెండేళ్ల వ్యవధిలో కొత్త నగరాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయడం ఇది రెండోసారి. 2016లో రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు కేంద్రాలుగా నగరాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేశారు. 
  • యూడీఏ పరిధిలో ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి త్వరలో అమలు చేయనున్నారు. నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యవసాయ ప్రాంతాల అభివృద్ధిపై ఇప్పటికంటే మరింత స్పష్టత వస్తుంది.
  • ప్రజల భవిష్యత్తు అవసరాలకు వీలుగా మాస్టర్‌ ప్లానును అనుసరించి రహదారులు అందుబాటులోకి వస్తాయి. 
  • ప్రభుత్వం సమకూర్చే, రైతులు, ప్రజల నుంచి సమీకరించే భూములను అభివృద్ధి చేసి, లేఅవుట్లు వేసి ప్రజలకు స్థలాలను కేటాయిస్తారు. ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అందుబాటు ధరల్లో ఉంచుతారు. 
  • విస్తీర్ణం, జనాభా పెరుగుదలతో కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి కోసం ప్రవేశపెట్టే అనేక పథకాలు, కార్యక్రమాలు అమలుచేసే వీలుంటుంది. 
  • కొత్త నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు తప్పనిసరి చేస్తారు. పట్టణ ప్రణాళిక చట్టం అమలుతో అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను నియంత్రించవచ్చు. 
  • నగరాభివృద్ధి సంస్థలు ఆర్థికంగా బలోపేతం కావడంతో ప్రజల అవసరాల కోసం కల్యాణ మండపాలు, ఉద్యానవనాలు, సామాజిక భవనాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించి, అభివృద్ధి చేస్తారు. 

views: 884

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams