Current Affairs Telugu Daily

రైల్వే బోర్డు ఛైర్మన్‌గా వినోద్‌కుమార్‌ యాదవ్‌
రైల్వే బోర్డు ఛైర్మన్‌గా దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌(జీఎం) వినోద్‌కుమార్‌ యాదవ్‌ నియమితులయ్యారు.
  • కేంద్ర ప్రభుత్వ ఎక్స్‌ అఫీషియో ముఖ్య కార్యదర్శిగా, ఐఆర్‌ఎస్‌ఈఈ ఛైర్మన్‌గా కూడా కొనసాగుతారు. వినోద్‌కుమార్‌ యాదవ్‌ నియామకాన్ని కేంద్ర మంత్రివర్గ నియామకా కమిటీ 2018 డిసెంబర్‌ 31న ఆమోదించింది.
  • ప్రస్తుత బోర్డు ఛైర్మన్‌ అశ్వనీ లోహానీ పదవీకాలం తరువాత ఆయన స్థానంలో వినోద్‌కుమార్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.
  • దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు రెగ్యులర్‌ జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తూ అత్యున్నత రైల్వే బోర్డు ఛైర్మన్‌గా ఎంపికైన తొలి అధికారి వినోద్‌కుమార్‌ యాదవ్‌.  రైల్వే మంత్రిత్వశాఖలో కీలక నిర్ణయాన్నీ ఈ బోర్డే తీసుకుంటుంది.

views: 861



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams