Current Affairs Telugu Daily

బంగ్లాదేశ్‌ ఎన్నికల్లో షేక్‌ హసీనా విజయం
బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్‌ హసీనా(71) తాజా ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థి ఖాలిదా జియాపై పైచేయి సాధించడం ద్వారా వరసగా మూడోసారి పీఠాన్ని అధిరోహించనున్నారు.  
  • 300 స్థానాలున్న పార్లమెంటుకు 2018 డిసెంబర్‌ 30న జరిగిన 11వ సాధారణ ఎన్నికల్లో హసీనా పార్టీ అవామీ లీగ్‌ నేతృత్వంలోని మహాకూటమి 288 స్థానాలను సాధించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
  • మొత్తం పోలైన ఓట్లలో 82 శాతం మహాకూటమికి దక్కాయి. విపక్ష పార్టీతో కూడిన జాతీయ ఐక్యతా కూటమి(ఎన్‌యూఎఫ్‌) 15 శాతానికిపైగా  ఓట్లతో 7 సీట్లు, ఇతరులు 3 సీట్లలో విజయం సాధించారు.
  • ఒక స్థానంలో ఎన్నికలు వాయిదా పడగా, మరోస్థానంలో అభ్యర్థి మరణంతో ఫలితాలను ప్రకటించలేదు. 

views: 871Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams