Current Affairs Telugu Daily

నలుగురు సమాచార కమిషనర్ల నియామకం
కేంద్ర సమాచార కమిషన్‌(CIC)లో కొత్తగా నలుగురు సమాచార కమిషనర్లు నియమితులయ్యారు.
  • సమాచార కమిషనర్లుగా మాజీ ఉన్నతాధికారులు యశ్‌వర్ధన్‌ కుమార్‌ సిన్హా, వనజ ఎన్‌ సర్నా, నీరజ్‌ కుమార్‌ గుప్తా, సురేశ్‌చంద్ర నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదం తెలిపారు. సీఐసీలో ప్రధాన సమాచార కమిషనర్‌తో కలిపి 11 మంది సమాచార కమిషనర్లు ఉండొచ్చు.
  • తాజా నియామకాలతో వారి సంఖ్య ఏడుకు చేరుకుంది. యశ్‌వర్ధన్‌ కుమార్‌ సిన్హా 1981 బ్యాచ్‌ ఇండియన్‌ ఫారిన్‌ సర్వీసు(ఐఎఫ్‌ఎస్‌) అధికారి. బ్రిటన్‌లో భారత హై కమిషనర్‌గా పనిచేశారు.
  • కీలకమైన పాకిస్థాన్‌-అఫ్గానిస్థాన్‌-ఇరాన్‌ డివిజన్‌లోనూ అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. వనజ ఎన్‌ సర్నా 1980 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీసు(ఐఆర్‌ఎస్‌) అధికారి.
  • సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ చీఫ్‌గా పనిచేశారు. ప్రస్తుతం సీఐసీలో ఏకైక మహిళ ఆమే. 1982 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన నీరజ్‌ పెట్టుబడు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణశాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.
  • కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిగా సురేశ్‌ ఈ ఏడాది పదవీ విరమణ పొందారు. సిన్హా, సర్నా, నీరజ్‌ కూడా ఈ ఏడాదే పదవీ విరమణ పొందారు.
CIC-Central Information Commission

views: 765



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams