Current Affairs Telugu Daily

భూసేకరణ చట్ట పరిధిలోకి 5 ప్రాజెక్టు
కేంద్ర భూసేకరణ చట్టంలోని నిబంధనలలో కొన్నింటిని మార్పులు చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన సవరణ చట్టం పరిధిలోకి 5 ప్రాజెక్టులను చేర్చుతూ 2017 జూన్‌ 30న ఉత్తర్వులు  జారీచేసింది. 2013 కేంద్ర చట్టం ప్రకారం సామాజిక ప్రభావం, ప్రజాప్రయోజనం నిర్ధారణ(చాఫ్టర్‌-2), ఆహార భద్రత ప్రయోజనాల పరిరక్షణకు ప్రత్యేక నిబంధన(చాఫ్టర్‌-3)ను మినహాయిస్తూ చేసిన భూసేకరణ చట్టాన్ని ఈ ప్రాజెక్టులకు వర్తింపజేశారు. ఈ 5 ప్రాజెక్టులకు భూసేకరణ, సహాయ పునరావాసాన్ని కొత్తచట్టం మేరకు చేయనున్నారు.
1.    డిండి ప్రాజెక్టు
2.    పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు
3.    సీతారామ ప్రాజెక్టు
4.    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు
5.    కాళేశ్వర ప్రాజెక్టు 

views: 1074

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams