Current Affairs Telugu Daily

తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఒకేసారి ముమ్మారు తలాక్‌ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని నిషేధించే అత్యవసరాదేశం (ఆర్డినెన్సు) స్థానంలో ప్రవేశపెట్టిన బిల్లుకు 2018 డిసెంబర్‌ 27న   లోక్‌సభ ఆమోదం లభించింది.
  • తక్షణ, ముమ్మారు తలాక్‌ చెప్పడం చట్ట విరుద్ధమని, అలా చేసిన భర్తకు మూడేళ్ల వరకు కారాగార శిక్ష విధించవచ్చని ‘ముస్లిం మహిళ వివాహ హక్కు పరిరక్షణ బిల్లు-2018’ పేర్కొంటోంది.
  • ఇదివరకే లోక్‌సభ ఆమోదం తెలిపి, రాజ్యసభలో ఆమోదం కోసం నిరీక్షిస్తున్న బిల్లు స్థానంలో దీనిని కొత్తగా ప్రవేశపెట్టారు. చర్చ సందర్భంగా విపక్షాలు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తాయి.
  • ఈ ముసాయిదాలను క్షుణ్నంగా పరిశీలించాల్సి ఉన్నందున పార్లమెంటు ఉభయ సభ సభ్యుతో కూడిన సెలెక్ట్‌ కమిటీ పరిశీలనకు దీనిని పంపించాల్సిందేనని ఉమ్మడిగా డిమాండ్‌ చేశాయి.
  • మహిళా సాధికారత మాట ఎలా ఉన్నా ముస్లిం పురుషుల్ని శిక్షించడమే ప్రభుత్వ ఉద్దేశమని తప్పుపట్టాయి. ప్రభుత్వం దీనిని తోసిపుచ్చడంతో కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, అన్నాడీఎంకే, ఆర్జేడీ వంటి విపక్షాలు వాకౌట్‌ చేశాయి.
  • చివరకు ఓటింగులో 245 - 11 ఓట్ల వ్యత్యాసంతో బిల్లుకు ఆమోదం లభించింది. నిర్దిష్టంగా ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకోవానే ఉద్దేశమేదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

views: 688



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams