Current Affairs Telugu Daily

పోలింగ్‌ బూత్‌ల్లో పొగాకు ఉత్పత్తుల నిషేధం
పోలింగ్‌ బూత్‌ల్లో అన్ని రకాల పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని నిషేధిస్తూ ఎన్నిక కమిషన్‌ నిర్ణయం తీసుకొంది. 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో దీన్ని అమలు చేయనుంది.
  • పోలింగ్‌ బూత్‌ల్లో పొగ తాగరాదన్న నిషేధం ఇప్పటికే అమల్లో ఉంది. ఇకపై సిగరెట్లు, బీడీలతో పాటు గుట్కా, పాన్‌మసాలా వంటి పదార్థాల వినియోగాన్ని కూడా నిషేధించింది.
  • పొగాకు పదార్థాలను వినియోగించకూడదంటూ పోలింగ్‌ బూత్‌ వద్ద బ్యానర్లను కట్టనున్నారు. ఈ నిబంధనలను అమలు చేయడానికి ప్రిసైడింగ్‌ అధికారే నోడల్‌ అధికారిగా వ్యవహరించనున్నారు.

views: 739

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams