Current Affairs Telugu Daily

కమర్షియల్‌ కాంప్లెక్స్‌లుగా 10 రైల్వే స్టేషన్ల అభివృద్ధి 
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోని NBCC, రైల్వేశాఖ ఆధ్వర్యంలోని రైల్వే భూఅభివృద్ధి సంస్థ 2017 జూన్‌ 30న ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా తొలిదశలో దేశవ్యాప్తంగా 10 రైల్వే స్టేషన్లలో కమర్షియల్‌ కాంప్లెక్స్‌లను అభివృద్ధి చేస్తారు. దేశవ్యాప్తంగా 100 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగానే 400 స్టేషన్లను అభివృద్ధి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. తొలిదశలో 10 స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ స్టేషన్ల పరిధిలో ఉన్న భూమిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం NBCC, RLDAలు కలిపి సగంసగం భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రయోజక వాహనాన్ని (SPV) ఏర్పాటు చేస్తారు. ఈ SPV ప్రతి స్టేషన్‌ అభివృద్ధి కోసం ముందుకొచ్చే సంస్థలతో ఒప్పందం చేసుకుంటుంది. ఈ పది స్టేషన్లలోని రైల్వే భూమిని ఆక్రమణలు , తాకట్టుల నుంచి విడిపించి SPVకి నామమాత్రపు ధరపై 45 ఏళ్ల పాటు లీజుకిస్తుంది. ఇలా లీజుకు ఇచ్చిన భూమిలో నిర్మించే ప్రాజెక్టులను NBCC పర్యవేక్షిస్తుంది. దేశవ్యాప్తంగా 10 స్టేషన్ల పునఃఅభివృద్ధి పనుల పర్యవేక్షణకు ప్రత్యేక సాధికార సంస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో రైల్వే, RLDA, NBCC అధికారులు సభ్యులుగా ఉంటారు.
10 రైల్వే స్టేషన్లు
1.    తిరుపతి
2.    నెల్లూరు
3.    డిల్లీ సరాయ్‌ రొహిల్లా
4.    మడగావ్‌
5.    లక్నో
6.    గోమతినగర్‌
7.    కోటా
8.    థానే న్యూ
9.     ఎర్నాకుళం
10.    పుదుచ్చేరి 
NBCC-National Building Construction Corporation
RLDA-Rail Land Development Authority
SPV-Special Purpose Vehicle

views: 967

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams