Current Affairs Telugu Daily

రైలు ప్రయాణంలో గుర్తింపునకు ఈ-ఆధార్‌కు అనుమతి
రైలు ప్రయాణాల్లో గుర్తింపుకార్డుగా చూపడానికి ఇకమీదట ఈ-ఆధార్‌ ప్రింటింగ్‌ కాపీనీ అనుమతిస్తూ రైల్వేశాఖ 2017 జూన్‌ 30న ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ఒరిజినల్‌ ఆధార్‌ను మాత్రమే ఇందుకోసం అనుమతించేవారు. ప్రస్తుతం ఆస్థానంలో ఈ-ఆధార్‌కు కూడా అవకాశం కల్పించారు. వీటితోపాటు ఎన్నికల గుర్తింపుకార్డు, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, డ్క్రెవింగ్‌ లైసెన్సు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఫొటో గుర్తింపుకార్డు (సీరియల్‌ నెంబర్‌ ఉండాలి), పాఠశాలు, కాలేజీలు జారీచేసిన విద్యార్థి గుర్తింపుకార్డు, జాతీయ బ్యాంకుల పాస్‌బుక్కులు (ఫొటోతో సహా), ల్యామినేటెడ్‌ బ్యాంకు క్రెడిట్‌కార్డులు, రేషన్‌కార్డులను గుర్తింపుకార్డులుగా అనుమతిస్తారు.
views: 1043

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams