Current Affairs Telugu Daily

తెలంగాణ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు 
తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు పంచాయతీరాజ్‌ శాఖ 2018 డిసెంబర్‌ 24న రిజర్వేషన్లను ఖరారు చేసింది.
  • మొత్తం 12,751 పంచాయతీల్లో 1,281 షెడ్యూల్‌ ప్రాంతాలకు, 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 పంచాయతీలను వారికే కేటాయించింది.
  • మిగిలిన 10,293 పంచాయతీల్లో రిజర్వేషన్లు ప్రకటించింది. 50 శాతం అంటే 6,378 పంచాయతీలను మహిళకు కేటాయించారు. 
  • షెడ్యూలు ప్రాంతాలు, 100 శాతం ఎస్టీలకు కేటాయించిన పంచాయతీలు పోను మిగిలిన పంచాయతీల్లో 22.79 శాతం బీసీలకు అంటే 2,345 పంచాయతీలు కేటాయించారు.
  • ఎస్సీలకు 2,113 (20.53 శాతం), ఎస్టీలకు 688 (6.68 శాతం) పంచాయతీలు కేటాయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్సు ప్రకారం 20 శాతానికి మించకుండానే రిజర్వేషన్ల కేటాయింపు పూర్తి చేశారు.
  • రాష్ట్రం యూనిట్‌గా సర్పంచి, గ్రామం యూనిట్‌గా వార్డు రిజర్వేషన్‌ ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుని ప్రక్రియ పూర్తి చేశారు.
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీసీలకు పంచాయతీలేవీ లేవు. ఈ జిల్లాలో 479 పంచాయతీలుండగా 454 షెడ్యూలు ఏరియాలోనే ఉన్నాయి.
  • షెడ్యూలు ప్రాంతాల్లో లేని పంచాయతీలు కేవలం 25 మాత్రమే. వీటిలో ఎస్టీలకు 9, ఎస్సీలకు 5, జనరల్‌ కేటగిరిలో 11 గ్రామ పంచాయతీలున్నాయి.
  • 9 షెడ్యూలు ప్రాంత జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం, కుమురంభీం ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, నాగర్‌కర్నూలు, వరంగల్‌ పరిధిలో 1,281 పంచాయతీలున్నాయి.

views: 1018

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams