Current Affairs Telugu Daily

అమెరికా రక్షణమంత్రి మ్యాటిస్‌ రాజీనామా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అమెరికా రక్షణమంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ రాజీనామా చేశారు.
  • అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి తమ సైనికులను గణనీయంగా వెనక్కి రప్పించనున్నట్లు ప్రకటించారు. సిరియా నుంచి బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటామంటూ ట్రంప్‌ 2018 డిసెంబర్‌ 18న చేసిన ప్రకటన ప్రపంచాన్ని నివ్వెరపర్చగా.. దాన్నుంచి తేరుకోకముందే ఈ సంచలన నిర్ణయం వెలువడటం ప్రకంపనలు సృష్టిస్తోంది.
  • ట్రంప్‌ నిర్ణయాలపై అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన విధానాలతో విభేదిస్తూ ఏకంగా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ రాజీనామా చేశారు. బలగాల ఉపసంహరణతో సిరియా, అఫ్గాన్‌లో పరిస్థితులు అదుపు తప్పే ముప్పుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

views: 745



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams