Current Affairs Telugu Daily

అటార్నీ జనరల్‌గా వేణుగోపాల్‌
భారత అటార్నీ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది కొట్టాయన్‌ కటాన్‌కోట్‌ వేణుగోపాల్‌ నియమితులయ్యారు. వేణుగోపాల్‌ నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ 2017 జూన్‌ 30న ఆమోదముద్ర వేశారు. ఇప్పటివరకు ఈ పదవిలో ముకుల్‌ రోహత్గి ఉన్నారు. 1960 నుంచి న్యాయవాది వృత్తిలో ఉన్న వేణుగోపాల్‌ మొరార్జీ దేశాయ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో అదనపు సొలిసిటరల్‌ జనరల్‌గా పనిచేశారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణం కేసులో అమికస్‌ క్యూరీగా వ్యవహరించారు. బాబ్రీ విధ్వంస కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తరపున వాదనలు వినిపించారు. కేరళకు చెందిన వేణుగోపాల్‌ దేశంలో న్యాయ సంస్కరణల్లో ప్రముఖ పాత్ర పోషించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో సుప్రీంకోర్టు బెంచ్‌ల నియామకాన్ని వ్యతిరేకించిన ఆయన.. భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్‌, పద్మ విభూషణ్‌ వంటి అత్యన్నత పురస్కారాలు అందుకున్నారు.
views: 1039

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams