Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌కు 9 స్కోచ్‌ పురస్కారాలు
పౌర సేవలు, అభివృద్ధి, వినూత్న పథకాల అమలు, ప్రభుత్వ విభాగాల్లో సంస్కరణల అమలు అంశాల ప్రాతిపదికన అందించే స్కోచ్‌ పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్‌కు తొమ్మిది దక్కాయి.
  • డిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో 2018 డిసెంబర్‌ 22న వీటిని ప్రదానం చేశారు. పెట్టుబడుల ప్రోత్సాహం, సౌకర్యాల కల్పన విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి మండలికి అవార్డు దక్కింది.
  • ఆ పురస్కారాన్ని మండలి ప్రత్యేక కమిషనర్‌ భావనా సక్సేనా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రామీణ బ్యాంక్‌కు రెండు (టెక్నాలజీ ఇన్‌ ఏజెన్సీ బ్యాంకింగ్‌, ఇంక్లూజివ్‌ బ్యాంకింగ్‌) అవార్డు, రవాణా శాఖకు (ఆన్‌లైన్‌ వెబ్‌ అప్లికేషన్‌) ఒక అవార్డు, ఆంధ్రప్రదేశ్‌ ఇ-ప్రగతి అథారిటీకి 5 (మై ఏపీ పోర్టల్‌, సర్టిఫికెట్‌-లెస్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌, లైసెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌, ఇహైవే, వర్క్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌) అవార్డులు దక్కాయి.

views: 972

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams