Current Affairs Telugu Daily

టైమ్స్‌ ప్రభావశీల టీన్స్‌ జాబితాలో భారత సంతతి విద్యార్థులకు చోటు
పలు రంగాల్లో విశేష కృషితో 2018లో ప్రపంచంపై తమదైన ముద్ర వేసిన 25 మంది అత్యంత ప్రభావశీల టీన్స్‌(13-19 ఏళ్ల మధ్యవయసున్నవారు) జాబితాలను ప్రఖ్యాత టైమ్స్‌ మేగజైన్‌ ప్రకటించింది.
  • ఈ జాబితాలో ముగ్గురు భారత సంతతి విద్యార్థుల కావ్య కొప్పరపు, రిషబ్‌ జైన్‌, అమికా జార్జ్‌కు చోటుదక్కింది. రిషబ్‌, కావ్య భారతీయ అమెరికన్లు కాగా.. అమికా బ్రిటన్‌వాసి. జాబితాలోని వారంతా తమ అద్వితీయ కృషితో ప్రపంచవ్యాప్తంగా యువతకు ప్రేరణగా నిలిచారని టైమ్స్‌ వెల్లడించింది. 
  • కావ్య హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్నారు. మెదడు క్యాన్సర్‌ బాధితుల నుంచి సేకరించిన కణజాలాన్ని స్కాన్‌ చేసి.. వాటి సాంద్రత, రంగు, కణాల రూపురేఖలను విశ్లేషించగల డీప్‌ లెర్నింగ్‌ కంప్యూటర్‌ వ్యవస్థను ఆమె అభివృద్ధి చేశారు. అవసరానికి తగ్గట్లు ఆయా వ్యక్తులకు చికిత్సలో మార్పు చేసి వ్యాధిని నయం చేయడంలో ఇది దోహదపడుతుంది. 
  • రిషబ్‌ 8వ గ్రేడ్‌ చదువుతున్నాడు. క్లోమ క్యాన్సర్‌ను నయం చేసే సామర్థ్యమున్నట్లు భావిస్తున్న క్రమసూత్ర పద్ధతి(ఆ్గరిథమ్‌)ను అభివృద్ధి చేశాడు.
  • బ్రిటన్‌లో ఇప్పటికీ చాలామంది విద్యార్థినుల అవసరమైన ఉత్పత్తుల కొనుగోలు చేయలేక బహిష్ఠు సమయంలో పాఠశాలకు గైర్హాజరవుతున్నట్లు గుర్తించిన అమికా తీవ్రంగా కత చెందారు. ‘ఉచిత బహిష్ఠు’ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు.
  • బహిష్ఠు సమయంలో అవసరమైన ఉత్పత్తుల కొనుగోలు చేయలేని అమ్మాయిలకు ప్రభుత్వం వాటిని ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్‌ చేసే పిటిషన్‌పై దాదాపు రెండు లక్షలమంది సంతకాలను సేకరించారు.

views: 910

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams