టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు కోచ్‌గా డబ్ల్యూ.వి.రామన్
టీమ్ ఇండియా మహిళల క్రికెట్ జట్టు నూతన కోచ్‌గా భారత మాజీ ప్లేయర్ డబ్ల్యూ.వి.రామన్ ఎంపికయ్యాడు.
మహిళ జట్టుకు రామన్ ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తాడని 2018 డిసెంబర్ 20న బీసీసీఐ ప్రకటించింది. 53 ఏళ్ల రామన్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు.
అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవం అతడికి లేదు. రంజీ ట్రోఫీలో తమిళనాడు, బెంగాల్ లాంటి పెద్ద జట్లకు కోచ్‌గా పని చేశాడు.
తమిళనాడుకు చెందిన డబ్ల్యూవీ రామన్ 1988 నుంచి 1997 మధ్య టీమ్ఇండియా తరఫున 11 టెస్టు, 27 వన్డేల్లో ఆడాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సెంచరీ (1992-93) చేసిన భారత తొలి ఆటగాడిగానే అతడు ఎక్కువ మందికి గుర్తుంటాడు.
ఐపీఎల్లో 2013లో పంజాబ్‌కు సహాయ కోచ్‌గా ఉన్న రామన్.. 2014లో కోల్‌కతాకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేశాడు.