Current Affairs Telugu Daily

రష్యాలో భూకంపం.. తీవ్రత 7.4గా నమోదు
రష్యాలోని తూర్పు ప్రాంతం కేమ్‌చాంటాలోని కమాండర్‌ దీవులలో 2018 డిసెంబర్‌ 20న భూకంపం సంభవించింది.
  • భూకంప లేఖినిపై 7.4గా నమోదైనట్లు చైనా ఎర్త్‌క్వేక్‌ నెట్‌వర్క్‌ సెంటర్‌ వెల్లడించింది. కమాండర్‌ దీవుల్లో బేరింగ్‌, మెడ్నీతో పాటు 15 వరకూ చిన్న దీవులున్నాయి.
  • భూకంప కేంద్రం నుంచి సుమారు 82 కిలోమీటర్ల వరకూ ప్రకంపన ప్రభావం ఉన్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ సంభవించే ముప్పుందని పసిఫిక్‌ సునామీ హెచ్చరిక కేంద్రం వెల్లడించింది.

views: 713Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams