Current Affairs Telugu Daily

40 మందికి ‘ప్రధాని శ్రమ అవార్డులు’
ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన కార్మికులకు ఏటా ఇచ్చే ప్రధానమంత్రి శ్రమ అవార్డులను కేంద్ర  కార్మికశాఖ 2018 డిసెంబర్‌ 20న ప్రకటించింది. 2017కు ఈ అవార్డు ప్రకటిస్తున్నట్లు పేర్కొంది.
  • ఈ ఏడాది శ్రమరత్న అవార్డులకు ఒక్క నామినేషన్‌ కూడా రాలేదని తెలిపింది. శ్రమ భూషణ్‌కు ముగ్గురిని, శ్రమవీర్‌/శ్రమ దేవి అవార్డులకు 16 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ముగ్గురు మహిళలు సహా మొత్తంగా 40 మందిని శ్రమ అవార్డులకు ఎంపిక చేశామని పేర్కొంది.
  • వీరిలో 23 మంది ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవారు కాగా 17 మంది ప్రైవేటు రంగానికి చెందినవారు. శ్రమభూషణ్‌ దక్కిన వారిలో విశాఖపట్నం నావల్‌ డాక్‌యార్డుకు చెందిన వెపన్‌ ఫిట్టర్‌ బీబీవీ ప్రసాదరావు రూ.లక్ష నగదు, ప్రశంసాపత్రం అందుకోనున్నారు.
  • శ్రమవీర్‌/శ్రమవీరాంగన దక్కిన వారిలో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌, విశాఖ స్టీల్‌ ప్లాంటుకు చెందిన సీనియర్‌ ఫోర్‌మన్లు పొమరశెట్టి రాజు, మండెం సుబ్రహ్మణ్య కుమార్‌, వీరంకి వెంకటేశ్వరరావు, హైదరాబాద్‌లోని బ్రహ్మోస్‌ ఏరోస్పేస్‌కు చెందిన సీనియర్‌ టెక్నీషియన్‌ గ్రేడ్‌-1 సినెగ సతీశ్‌కుమార్‌ ఉన్నారు.
  • వీరు రూ.60వేల నగదు, ప్రశంసాపత్రం అందుకోనున్నారు. హైదరాబాద్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌కు చెందిన మాస్టర్‌ టెక్నీషియన్‌ చెంచయ్య జడపల్లి, విశాఖపట్నం నావల్‌ డాక్‌యార్డుకు చెందిన ఎంసీఎం పండ నిరంజన్‌, విశాఖ స్టీల్‌ ప్లాంటు రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగం లిమిటెడ్‌కు చెందిన పల్ల సత్యనారాయణ, భద్రాచలం ఐటీసీకి చెందిన వర్క్‌మెన్‌ షేక్‌ షఫీలు శ్రమశ్రీ/దేవి దక్కిన వారిలో ఉన్నారు.

views: 705Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams