Current Affairs Telugu Daily

జీఎస్‌ఎల్‌వీ- ఎఫ్‌11 ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీర్తి అంబరాన్నంటుతోంది. ఈ ఏడాది వరుస విజయాలతో సత్తా చాటుతోంది. 35 రోజుల వ్యవధిలో 3 రాకెట్‌లను విజయవంతంగా ప్రయోగించింది. తాజాగా 
  • ఇస్రో 2018 డిసెంబర్‌ 19న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహకనౌకను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లురు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌11 వాహకనౌక రోదసీలోకి విజయవంతంగా దూసుకుపోయింది.
  • ఈ వాహకనౌక జీశాట్‌-7ఎ కమ్యూనికేషన్‌ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో భూ అనువర్తిత బదిలీ కక్ష్యలో ప్రవేశ పెట్టింది. 
  • జీశాట్‌-7ఎ అడ్వాన్స్‌డ్‌ మిలిటరీ కమ్యూనికేషన్‌ ఉపగ్రహంగా ఇస్రో వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో కేయూ బ్యాండ్‌ కమ్యూనికేషన్‌ సాధనాలున్నాయి. వైమానిక దళానికి, రక్షణశాఖకు సేవలందించనుంది.
  • విమానాల మధ్య కమ్యూనికేషన్‌ సేవలందించనుంది. అలాగే మిలిటరీకి కచ్చితమైన సమాచారం అందించనుంది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్‌ - కె.శివన్‌ 

views: 918

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams