Current Affairs Telugu Daily

జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన   
జమ్మూకశ్మీర్‌లో గవర్నర్‌ పాలనకు 6 నెలలు నిండటంతో 2018 డిసెంబర్‌ 19 అర్ధరాత్రి  నుంచి రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది.
  • దీంతో రాష్ట్రంలోని అన్ని విధాన పరమైన నిర్ణయాల్ని తీసుకునేందుకు కేంద్ర మంత్రివర్గానికి మార్గం సుగమం కానుంది.
  • రాష్ట్రంలో కేంద్రపాలన విధించే ప్రకటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సంతకం చేశారు. గవర్నర్‌ సత్యపాల్‌ మలిక్‌ పంపిన నివేదికను, ఇతరత్రా సమాచారాన్ని రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకున్నారని, రాష్ట్రపతి పాలన అవసరమని సంతృప్తి చెందారని డిసెంబర్‌ 19న జారీ చేసిన గెజిట్‌ ప్రకటనలో పేర్కొన్నారు.
  • ఎన్నికల్ని ప్రకటించకపోతే రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించే అవకాశం ఉంది.

views: 660

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams