Current Affairs Telugu Daily

న్యూయార్క్‌లో శునకానికి గౌరవ డిప్లొమా 
న్యూయార్క్‌లోని క్లార్క్‌సన్‌ యూనివర్సిటీ ఓ శునకానికి గౌరవ డిప్లొమా ప్రదానం చేసింది. ఈ శునకానికి ఈ గౌరవం దక్కడం వెనుక బ్రిటనీ హాలీ అనే అమ్మాయి కృషి ఎంతో ఉంది.
  • క్లార్క్‌సన్‌ యూనివర్సిటీ నుంచి ఇటీవలే సైకాజీలో ఆక్యుపేషనల్‌ థెరపీ స్పెషల్‌ సబ్జెక్టుగా మాస్టర్స్‌ డిగ్రీ అందుకున్న బ్రిటనీ హాలీ ఈ థెరపీలో ఆమెకు ఎంతో చేదోడువాదోడుగా ఉన్న గ్రిఫిన్‌ అనే శునకానికి కూడా డిప్లొమా ఇవ్వాల్సిందిగా సిఫారసు చేసింది.
  • దీంతో గ్రిఫిన్‌ శక్తిసామర్థ్యాలు పరీక్షించిన యూనివర్సిటీ నిర్వాహకులు అందుకు అంగీకరించడమే కాకుండా డిప్లొమా అందజేశారు. ఈ శునకం పేరు గ్రిఫిన్‌.
  • నార్త్‌ కరోలినాలోని విల్సన్‌కు చెందిన బ్రిటనీ చక్రాల కుర్చీ లేనిదే ఎటూ కదల్లేదు. కండరాల వ్యాధితో బాధపడుతున్న ఆమె వెంట నిరంతరం ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఆ లోటును గ్రిఫిన్‌ తీరుస్తోంది.
  • సైకాలజీ పేషంట్లకు సేవచేయడంలో బ్రిటనీకి అసిస్టెంట్‌గా పనిచేస్తోంది. వెస్ట్‌ వర్జీనియా జైళ్లల్లో పాస్‌4 ప్రిజన్‌ ప్రోగ్రామ్‌ ద్వారా ఆమె ఆ కుక్కను తెచ్చుకుంది. ఖైదీలు శిక్షణ ఇచ్చిన శునకం కావడంతో బ్రిటనీ చెప్పిన పనులన్నీ చకచకా చేసేది.  

views: 1014



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams