విమానయాన భద్రతలో భారత్‌కు ‘కేటగిరీ 1’ రేటింగ్‌ను కొనసాగించిన అమెరికా
విమానయాన భద్రత విషయంలో అమెరికా నియంత్రణ సంస్థ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(FAA) భారత్‌కు అత్యధిక రేటింగ్‌ను కొనసాగించింది.
2018 జులైలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ)లో ఎఫ్ఏఏ ఆడిట్‌ను నిర్వహించింది. భారత అంతర్జాతీయ విమానయాన భద్రత మదింపు(ఐఏఎస్ఏ) రేటింగ్ ‘కేటగిరీ 1’గా కొనసాగింది.
‘కేటగిరీ 1’ రేటింగ్ ఉంటే సదరు దేశం అమెరికాలో సాధారణ పద్ధతుల్లోనే సేవలను కొనసాగించవచ్చు. అమెరికా విమానయాన సంస్థలతో సీట్ల సర్దుబాటును చేసుకోవడానికీ వీలుంటుంది.