Current Affairs Telugu Daily

మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం భారత పర్యటన
మూడు రోజుల పర్యటన నిమిత్తం మాల్దీవుల అధ్యక్షుడు ఇబ్రహీం మహమద్‌ సొలిహ్ 2018 డిసెంబర్‌ 17న భారత్‌కు వచ్చారు.
  • డిల్లీలో ప్రధాని నరేంద్రమోడితో చర్చలు జరిపారు. వీసా జారీ, సాంస్కృతిక, వ్యవసాయాధారిత వ్యాపారం, ఐ.టి. రంగాల్లో సహకారానికి 4 ఒప్పందాలపై ఇరు దేశాలూ సంతకాలు చేశాయి.
  • మాల్దీవులకు 1.4 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10వేల కోట్లు) సాయం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది.
  • చైనా నుంచి తీసుకున్న రుణాల భారంతో ఆ దేశం సతమతమవుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి ఈ నిర్ణయాన్ని వెలువరించారు.

views: 722Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams