Current Affairs Telugu Daily

విజయ్‌ దివస్‌
విజయ్‌ దివస్‌ను దేశ వ్యాప్తంగా 2018 డిసెంబర్‌ 16న ఘనంగా నిర్వహించారు. 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసం పాకిస్థాన్‌తో యుద్ధంలో భారత విజయానికి గుర్తుగా ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
  • విజయ్‌ దివస్‌ను పురస్కరించుకుని అమరవీరులకు ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ నివాళులు అర్పించారు. 
  • విజయ్‌ దివస్‌ను పురస్కరించుకొని యుద్ధంలో అమరులైన 12 మంది భారత జవాన్లను బంగ్లాదేశ్‌ సత్కరించింది. వారి కుటుంబాలకు ‘సమ్మాననా ఫలకాలను’ బంగ్లాదేశ్‌ మంత్రి ఏకేఎం మొజామెల్‌ హఖ్‌ అందించారు. కోల్‌కతాలో ఈ కార్యక్రమం జరిగింది.

views: 813



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams