9 ఏళ్లకే మొబైల్ యాప్ను అభివృద్ధి చేసిన భారతీయ బాలుడు ఇప్పుడు 13 ఏళ్లకే ఓ సాఫ్ట్వేర్ కంపెనీని దుబాయ్లో స్థాపించాడు.
కేరళకు చెందిన ఆదిత్యన్ రాజేశ్ ఐదేళ్లకే కంప్యూటర్ వాడటం ప్రారంభించాడు. రాజేశ్ ఇప్పటికే పలు కంపెనీలకు వెబ్సైట్లు, లోగోలు రూపొందిస్తున్నాడు.
ఆదిత్యన్ కేరళలోనే పుట్టినా తన తల్లిదండ్రులతో కలిసి 8 ఏళ్ల క్రితం నుంచి దుబాయ్లో ఉంటున్నాడు. తాజాగా అతను ట్రైనెట్ సొల్యూషన్స్ అనే సాఫ్ట్వేర్ కంపెనీని అక్కడే స్థాపించాడు.
ప్రస్తుతానికి ఇందులో ముగ్గురు ఉద్యోగులుండగా వారంతా ఆదిత్యన్ సహ విద్యార్థులు, స్నేహితులే.