Current Affairs Telugu Daily

ఔషధ చట్టం పరిధిలోకి మరో 4 పరికరాలు
సాధారణ వైద్య సాధనాలైన నెబ్యులైజర్లు, రక్తపోటు పరిశీలన సాధనాలు, డిజిటల్‌ థర్మోమీటర్లు, గ్లూకోమీటర్లను ‘ఔషధాలు, సౌందర్య సాధనా చట్టం’ కిందకు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
  • దీనివల్ల వాటి నాణ్యత, పనితీరును ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి వీలవుతుంది.
  • 2020 జనవరి 1 నుంచి ఈ సాధనా దిగుమతి, ఉత్పత్తి, విక్రయాలను డ్రగ్‌ కంట్రోర్‌ జనరల్‌ పర్యవేక్షిస్తారు. వీటిని వైద్య పరికరాల మార్గదర్శకాలు, భారత ప్రమాణాల బ్యూరో నిర్దేశించిన నాణ్యత నిబంధన కింద నమోదు చేసుకోవాలి. ప్రస్తుతం 23 వైద్య పరికరాలు ఔషధ చట్టంలో ఉన్నాయి.
  • 8 విభాగాలుగా వైద్య పరికరాల జాబితాను విస్తరించేందుకు ఆరోగ్యశాఖ ప్రతిపాదించింది. అందులో ఇంప్లాంటబుల్‌ వైద్య సాధనాలు, ఎమ్మారై పరికరాలు, సీటీ స్కాన్‌ సాధనాలు, డిఫిబ్రిరిలేటర్లు, డయాసిస్‌ యంత్రాలు, పెట్‌ సాధనాలు, ఎక్స్‌రే యంత్రాలు, బోన్‌ మ్యారో సెల్‌ సెపరేటర్లు ఉన్నాయి.

views: 698

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams