Current Affairs Telugu Daily

సింగపూర్‌ ఎంఓయూ అమలుకు కార్యాచరణ కమిటీ
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ
(సీఆర్‌డీఏ)తో సింగపూర్‌ సంస్థ కుదుర్చుకున్న అవగాహనా
ఒప్పందం అమలుకు ముఖ్యమంత్రి అధ్యక్షతన సంయుక్త
కార్యాచరణ కమిటీ (జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ)
ఏర్పాటైంది. ఈ మేరకు సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్‌
జూన్‌ 28న ఉత్తర్వులు జారీచేశారు. 2017 మే 15న సింగపూర్‌
ప్రభుత్వం సీఆర్‌డీఏ మాస్టర్‌ డెవలప్‌మెంట్‌కు ఎంఓయూ
చేసుకుంది. దీని అమలుకు ఐదుగురు సభ్యులతో కమిటీని
వేశారు. ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్థిక
మంత్రి,పురపాలకశాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
పురపాలక శాఖ ముఖ్య కార్యదరి సభ్యులుగా ఉంటారు.స్టీరింగ్‌
కమిటీతో పాటు జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ వర్కింగ్‌ కమిటీని
ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ప్రతి రెండు నెలలకు ఒకసారి
సమావేశమైస్టీరింగ్‌ కమిటీకి నివేదిక ఇస్తుంది.

views: 1046

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams