Current Affairs Telugu Daily

ఏపీకి జాతీయ ఇంధన పురస్కారం    

ఆంధ్రప్రదేశ్‌ ఇంధన సంరక్షణ మిషన్‌ (ఏపీఎస్‌ఈసీఎం)కు 2018 సంవత్సరానికి జాతీయ ఇంధన సంరక్షణ అవార్డు (ఎన్‌ఈసీఏ) లభించింది. జాతీయ ఇంధన సంరక్షణ దినం సందర్భంగా ఇంధన సామర్ధ్య సంస్థ(బీఈఈ) ఆధ్వర్యంలో శుక్రవారం దిల్లీలో జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌, కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్‌ చేతుల మీదుగా సీఈఓ చంద్రశేఖరరెడ్డి పురస్కారాన్ని అందుకున్నారు. ప్రభుత్వ సంస్థల విభాగంలో వరుసగా నాలుగో ఏడాది ఈ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కే దక్కింది. డిస్కంల విభాగంలో విద్యుత్తు పొదుపు, ఉత్తమ పనితీరుకు ఏపీఎస్పీడీసీఎల్‌కు సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు లభించింది.      


views: 1096



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams