Current Affairs Telugu Daily

ఇంధన పొదుపులో దక్షిణ మధ్య రైల్వేకు 6 అవార్డులు 
విద్యుత్‌ వినియోగంలో పొదుపు చర్యలు పాటిస్తున్న దక్షిణ మధ్యరైల్వేకు జాతీయ స్థాయిలో 6 అవార్డులు లభించాయి.
  • కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది. డిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో 2018 డిసెంబర్‌ 14న జరిగిన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌ అవార్డును ప్రదానం చేశారు.
  • సికింద్రాబాద్‌లోని ప్రయాణికుల రిజర్వేషన్‌ కార్యాలయ భవనానికి ఇంధన పొదుపులో ప్రథమ బహుమతిని స్పీకర్‌ నుంచి ద.మ.రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌ ఎ.ఎ.ఫడ్కే, సికింద్రాబాద్‌ డివిజన్‌ డి.ఆర్‌.ఎం. అమిత్‌ వరదన్‌ అందుకున్నారు.
  • భవనా నిర్వహణలో సికింద్రాబాద్‌లో జోన్‌ ప్రధాన కార్యాలయం రైల్‌నిలయం, హైదరాబాద్‌ భవన్‌ (డీఆర్‌ఎం కార్యాలయం)కు సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు.. రైల్వేస్టేషన్ల విభాగంలో హైదరాబాద్‌, కాజీపేట, నిజామాబాద్‌ స్టేషన్లకు అవార్డులు ప్రకటించారు.

views: 807

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams